సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దురాశపరులకు దుష్ట శక్తులకు లొంగకుండా ఆత్మశక్తి తో ఎలా ఎదిరించాలి, దానికి కావలసిన శక్తిని ప్రకృతి లో యోగ తో, బాలన్స్ మైండ్ తో ఎలా సాదించాలి అన్న విభిన్న ఫాంటసీ అంశంతో హర్రర్ జోడించి దర్శకుడు మారుతి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన క్వాలిటీ సినిమా ‘ది రాజాసాబ్’ సినిమా ఇప్పుడు ఓటీటీకి రాబోతోంది. ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ ఏకంగా భారీ స్థాయిలో సుమారు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్త సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోవడంతో మొదట్లో నెగిటివ్ టాక్ ప్రచారం పేద్ద ఎత్తున జరిగింది. అయినప్పటికీ ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా.. రిలీజ్ తరువాత ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినా సంక్రాంతి సినిమాలలో 250 కోట్ల పైగా కలెక్షన్ సాధించి అందరిని నివ్వెర పరచింది. భీమవరం లో 3వారాలకు సుమారు గా 1కోటి 35 లక్షలు కలెక్షన్స్ సాధించడం పెద్ద విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *