సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం నరకచతుర్దశి జరుపుకొంటున్నారు. శ్రీ కృష్ణ సత్యభామల తో యుద్ధంలో నరకుడు అనే రాక్షసుడు మరణించిన రోజు. ఈ విజయోత్సవం లో భాగంగా దీపావళి పర్వదినం రేపు సోమవారం దేశవ్యాప్తంగా దీపావళి పండగ చేసుకుంటారు. అయితే ఆబాల గోపాలానికి ఇష్టమైన ఈ పండగ భారత్‌ ఒక్క దేశంలోనే కాదు వివిధ దేశాల్లో పలు పేర్లతో ఈ పండగ చేసుకుంటారు. ఈ పండగ వేళ.. దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచడంతోపాటు లక్ష్మీ, గణేశ్‌లను భక్తి శ్రద్థలతో పూజిస్తారు. భారీ బాణాసంచా కాల్పులు నిర్వహిస్తారు. అంతేకాదు ఐదు రోజుల పాటు ఈ దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ధన త్రయోదశితో ప్రారంభమై.. నరక చతుర్ధశి, దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్‌లతో ఈ పండగ ముగుస్తుంది. ఈ దీపావళిని భారత్‌ తో పాటు శ్రీలంక , నేపాల్, మారిషస్ , సింగపూర్, మలేసియా ,ఆస్ట్రేలియా సమీపంలోని లోని పిజి , కరేబియన్ దేశాలలో , అమెరికా లో వైట్ హౌస్ తో ప్రసిడెంట్ ట్రంప్ తో సహా పలు నగరాలలో అత్యంత ఘనంగా భారతీయ సంప్రదాయం ప్రకారం విదేశీయులు కూడా దీపావళి జరుపుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *