సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో ప్రక్క దీపావళి పండుగ 4రోజులలో ఉంది. వరుస వర్షాలతో తడిసి ముద్దవుతున్న ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు దీపావళి పండుగ కు ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి దీపావళి కి తుపానుగా ఏపీ ఫై పడుతుందని మీడియా ఛానెల్స్ లో అదరగొడుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. దీనితో పండుగ వ్యాపారంపై ఆశలు పెట్టుకొన్న బాణాసంచా మొదలుకొని బంగారం వరకు అందరు వ్యాపారులలో ఆందోళన మొదలయింది.అయితే ముందుగా ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటవచ్చని భావించారు. కానీ ఏపీ–ఒడిశా తీరం వైపు వచ్చినా.. మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా–పశ్చి మబెంగాల్ వైపు కదులుతుందని తాజాగా అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్ తీరంలో సముద్రఉష్ణోగ్రతలు ఇక్కడి కంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తుపాను పశ్చిమబెంగాల్ దిశగా కదిలేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని,వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఏపీకి తుపాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తాజగా నేడు, గురువారం ప్రకటించింది.అయితే తీరా ప్రాంతాలలో సముద్రగాలులు, చెదురుమదురు వర్షాలు మాత్రం పడతాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *