సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై మరోసారి జరుగుతున్నా దుర్గగుడి ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ మధ్య రగులుతున్న వివాదంపై దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. నేడు, ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల దాడులపై.. ఈవోపై విమర్శలు చేయడం తగదన్నారు. కొంతమంది తమ ఇష్ట ప్రకారం పనులు కావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిని కాదని సీఎం జగన్కు ఈవోపై ఫిర్యాదు చేసారని, దేవాదాయ మంత్రిని నేను ఉండగా ఇలా ఎందుకు చేసారని ప్రశ్నించారు. వివాదంపై విచారణ చేయాలని సీఎం ఆఫీస్ మళ్లీ తనకే పంపిస్తుందన్నారు. దుర్గ గుడి పాలకమండలి నియామకం జరిగి ఎంతో కాలం కాలేదని.. అయితే కొందరు వ్యక్తులు గుడిపై మొత్తం తమదే పెత్తనం అనే భావనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా దేవాదాయ శాఖ ఫై ఇటీవల అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని .. ఫిర్యాదులో వాస్తవం ఉంటె.. దేవాదాయ శాఖలో అవినీతి అధికారులను తాను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. .. అంతిమంగా ప్రభుత్వం చేసే నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
