సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నార్త్ సిక్కింలో నేడు, శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. . జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేఓలు , 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు ఆర్మీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరజవాన్లు అందించిన సేవలు, నిబద్ధతను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపి వారికీ అండగా ఉంటామన్నారు. ఫై చిత్రంలో ట్రక్కు తునాతునకులు అయిన దృశ్యం చూడవచ్చు…
