సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విభిన్న జోనర్స్ లో సినిమాలు చేసే హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘లక్కీ భాస్కర్’ సినిమా ట్రైలర్ విడుదలయిన తరువాత నుండి ప్రేక్షకులలో హైప్ మాములుగా లేదు. ఈ సినిమా దీపావళి కానుకగా నేడు, గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆద్వర్యంలోని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కథ విషయానికొస్తే.. ఈ కథ 1989 – 92 సమయంలో జరుగుతుంది. బ్యాంకులలో లొసుగులను వాడుకొని ఒక మధ్యతరగతి వ్యక్తి డబ్బుతో అడ్డుకొన్న గేమ్ ఈ సినిమా కధ .. భాస్కర్(దుల్కర్ సల్మాన్) ఓ మాములు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్. సుమతి(మీనాక్షి చౌదరి) అతని దగ్గర డబ్బులేకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. భాస్కర్ కు ఇంట్లో తమ్ముడు, చెల్లి చదువులు, పెళ్లిళ్లు, నాన్న హెల్త్, కొడుకు ఫీజ్.. ఇలా ఎన్నో కష్టాలు, వాటికి తోడు అప్పులతో బతుకుతుంటాడు. ఇతని దగ్గర డబ్బు లేదని సుమతి తల్లి ఇంట్లో అవమానపరుస్తారు. భాస్కర్ కి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కూడా పోతుంది. . దీంతో భాస్కర్ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో యాంటోని(రాంకీ) లోన్ కోసం తిరుగుతుంటాడు. ఒక్క రోజులో రెట్టింపు చేసి తీర్చేస్తా అంటాడు. అతనికి బ్యాంక్ రూల్స్ ప్రకారం లోన్ రాదు. కానీ ఆ కాలంలో బ్యాంక్ మనీ శుక్రవారాలు తీసి సోమవారం కల్లా పెట్టేలాగా కొన్ని స్కామ్స్ జరిగేవి. అలా భాస్కర్ బ్యాంక్ మనీ తీసుకొచ్చి యాంటోనికి ఇచ్చి అతని బిజినెస్ లో కమిషన్స్ తీసుకుంటూ సంపాదిస్తాడు. భాస్కర్ కి ఏకంగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రమోషన్ వస్తుంది. అప్పట్లో షేర్ మార్కెట్స్ స్కామ్ చేసిన హర్ష మెహ్రాకు సాయం చేసి భాస్కర్ ఇంకా సంపాదించడం మొదలుపెడతాడు. అలా ఓ రోజు CBI వాళ్ళు భాస్కర్ పై రైడ్ చేస్తారు.ఇంతకీ CBI వాళ్ళు భాస్కర్ ని పట్టుకున్నారా? హర్ష మెహ్రా స్కామ్ లో భాస్కర్ ఇరుక్కున్నాడా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విషయానికి వస్తే హర్షద మెహ్రా జీవిత కథని మన నేటివిటీకి మార్చుకొని ఎమోషన్స్ కూడా పండించారు. భాస్కర్ పాత్రమాత్రమే కనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ అనే హీరో ఎక్కడ కనిపించదు.. ఇక సెకండ్ హాఫ్ డబ్బు సంపాదించడం, దాని వల్ల వచ్చే సమస్యలు, మంచి టెంక్షన్ కంటిన్యూ చేస్తూ ఆసక్తిగా చూపించారు. మంచి బ్యాగ్రౌండ్ సంగీతం అయితే పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి టిన్ను ఆనంద్, సర్వధామన్ బెనర్జీ, రాంకీ, సాయి కుమార్, సచిన్ ఖేద్కర్ అందరు ఉద్దండులయిన నటీనటులు.. రిచ్ గా నీట్ గా..దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా తియ్యడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *