సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు సమీపంలోని దువ్వ గ్రామంలో లో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నేడు, శుక్రవారం ఉదయం నిరసనకు దిగారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో ఆన్‌లైన్ లో తీవ్ర జాప్యం అవ్వడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా అయితే . రేపటి నుండి తమ పంట ధాన్యం ఆన్ లైన్ తూకాలు చేపట్టలేమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుకి సుమారు 50 లారీల ధాన్యం వెళ్లవలసి ఉన్నా ఐదు లారీలు కూడా ఆన్‌లైన్ కాలేదంటూ, ఇలాఅయితే ఎప్పటికి తమ ధాన్యం కొనుగోలు పూర్తీ అవుతుందంటూ,అదనపు సమయానికి ట్రాన్సుపోర్టు చార్జిలు ఎవరు ఇస్తారు?అంటూ నిరసనకు దిగారు. దువ్వ మీదుగా వెళ్లే జాతీయరహదారి మీద రోడ్లపై కూర్చుని బెటాయించారు. దానితో కొద్దీ సేపు వాహనాలు ఆగిపోయాయి. నిన్న ఉదయం నుంచి రోడ్ల పైనే ధాన్యం నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులయితే ఇది కావాలని చేసింది కాదని, ఆన్ లైన్ తమచేతులలో ఉండదని రైతులు సహకరించాలని కోరుతున్నారు. update photo..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *