సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చికెన్ ధరలు కేజీకి మార్కెట్ లో ప్రస్తుతం 220 నుండి 240 అందుబాటులో ఉండగా 30 అట్ట గుడ్డు రేటు రిటైల్ గా దాదాపు అదే ధర పలుకుతుండటంతో సామాన్యులు బెంబేలు పడుతున్నారు. ఇటీవల అనూహ్య స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో గత 2 నెలలుగా గుడ్డు రేటు పెరుగుతూ వస్తుంది. తాజాగా భీమవరం మార్కెట్ లో హోల్ సెల్ మార్కెట్లో 30 గుడ్డు అట్ట ధర 180 రూ. ఫై మాటే పలుకుతుంది. విడివిడిగా ఒక్కక్క గుడ్డు ధర మొన్న నవంబరులో రూ.5.30 పలికిన గుడ్డు డిసెంబరులో రూ.5.75-రూ.6.00కు పెరగ్గా ప్రస్తుతం రూ.6.30కు చేరింది. రిటైల్ గా 7 రూపాయలు ధర పలుకుతుండటం విశేషము.. కారణం విశ్లేషిస్తే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని ఢిల్లీ హర్యా నా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్ము -కశ్మీ ర్, అస్సాం పశ్చిమ బంగాల్, రాష్ట్రాల్లో చలి విపరీతం గా ఉండటంతో అక్కడ గుడ్డు వినియోగం భారీగా పెరిగిపోవడంతో మన ప్రాంతాల నుండి గుడ్లు మంచి ధరకు ఎగుమతులు అవుతుండటం తో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలలో తేలుతుంది. అక్కడ డిమాండ్ తో ఇక్కడ వినియోగదారులు ధరలు పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *