సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరే సూచనలు, స్వష్టం కావడంతో భారత్ ఎగుమతులపై అమెరికాలో సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగి వస్తాయనే అంచనాలు తో నేడు, గురువారం దేశీయ సూచీలు భారీ లాభాలతో దూసుకొనిపోయాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో గత సెషన్ ముగింపు (84, 426)తో పోల్చుకుంటే నేడు,గురువారం ఉదయం 600 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోష్‌ను కొనసాగిస్తోంది. నేటి ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో 85, 176 వద్ద కొనసాగుతోంది. 85 వేల మార్క్‌ను దాటేసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 212 పాయింట్ల లాభంతో 26, 080 వద్ద కొనసాగుతోంది. 26 వేల మార్క్‌కు పైన కొనసాగుతుంది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 379 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 518 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.89గా ఉంది.
