సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం తీవ్ర స్థాయి లో ఉగిసలాడిన భారత స్టాక్ మార్కెట్ నేడు, సోమవారం ఉత్సాహంగా దూసుకెళ్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ట్రంప్ భారత్ ఫై బెట్టు సడలించడం రష్యా నుంచి ఆయిల్ సరఫరా ఆందోళనలు తగ్గడం, అలాగే న్యూ ఢిల్లీలో ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలపై ఆశావాదం ఈ ర్యాలీకి ఊపునిచ్చాయి. దీంతో నేటి సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభం నుండే దూసుకొనిపోతుంది ఈ క్రమంలోనే ఉదయం 9.40 గంటల నాటికి సెన్సెక్స్ 1095 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 355, బ్యాంక్ నిఫ్టీ 711, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 630 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.ఈ లాభాలు చూస్తే చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా మంచి జోష్‌లో ఉన్నాయని అర్థమవుతోంది. సెన్సెక్స్‌లో లార్సెన్ అండ్ టుబ్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా మినహా దాదాపు అన్ని స్టాక్స్ గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి
