సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులుగా కాస్త అటుఇటుగా ఉంటున్న స్టాక్ మార్కెట్ సూచీలు నేడు, గురువారం(జూన్ 27న) కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 79,000 మార్కును దాటగా, నిఫ్టీ కూడా తొలిసారిగా 24 వేలను దాటేసింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 53,000 పాయింట్లను దాటడం విశేషం. కానీ ట్రేడింగ్ సెషన్లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత ఇండెక్స్‌లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 11 గంటల నాటికి 63 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, JSW స్టీల్, HUL కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, మారుతి సుజుకి, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, లార్సెన్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
