సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఆక్వా పంటల ఎగుమతుల రాజధాని గా పేరొందిన , పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరల రొయ్య రైతులకు మంచి రోజులు వచ్చాయి. కరోనా గ్రహణం, వైరస్ ల నుండి.. కర్ణుడి చావుకి లక్ష కారణాలు అన్నట్లు ఎన్నో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆక్వా రంగం ఇటీవల కొద్దీ నెలలుగా రొయ్య రేటు దూసుకొని పోతూ ఉండటంతో లక్ష 20 వేలు ఎకరాలు పైగా రొయ్య సాగు చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. . ప్రస్తుతం కేజీ కి 100 కౌంటు తూగే రొయ్య ధర రూ.260,-270 , 70 కౌంటు రూ.300, 60 కౌంటు రూ.320, 50 కౌంటు రూ.340, కీలకమైన 30 కౌంటు రొయ్య ధర రూ.460-470 వరకు పెరిగింది. గత 4 ఏళ్ళ క్రితంతో పోల్చుకొంటే కేజీ కౌంట్ కు వచ్చి సుమారు 80 రూ . పైగా ధరలు అదనంగా పెరిగాయి. మంచి ధర లభించడంతో రైతులు 100 కౌంటు రొయ్యలను పట్టుబడి చేస్తున్నారు. అయితే . ప్రస్తుతం రొయ్యకు రేటు పెరిగినప్పటికీ డిమాండ్ కు తగ్గ సరుకు రైతుల దగ్గర లేదని తెలుస్తుంది. అయితే ఇటీవల భీమవరం రిటైల్ మార్కెట్ లో పెరిగిన రొయ్యల భారీ ధరలు చూసి సామాన్యులు విస్తుపోతున్నారు. రొయ్యల కూరలు తగ్గించుకొంటున్నారు.
