సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద నేడు, మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా కొట్టిన ప్రమాద ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 25మంది ప్రయాణికులతో , ముగ్గురు డ్రైవర్స్ తో హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తుండగా దెందులూరు వద్దకు చేరుకునేసరికి ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. సమాచారం తెలిసిన వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగు పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్రేను సహాయంతో హైవే రోడ్డు ఫై బస్సు ను అడ్డు తొలగించారు, పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది, .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *