సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట దసరా పండుగలలో విజయ దశమి రోజు కర్నూలు జిల్లాలో ప్రతీ ఏటా సంప్రదాయం పేరిట జరిగే కర్రల యుద్ధం దేవరగట్టు బన్నీ ఉత్సవం గురించి చాల మందికి తెలిసిందే.. ఈసారి మాత్రం దెబ్బలతో పోకుండా భారీ విషాదంగా మారింది. గత గురువారం అర్ధరాత్రి దేవరగట్టు లోని శ్రీ అమ్మ వారి వివాహం స్వామివారితో జరిగిన తర్వాత ఊరేగింపు మొదలైంది. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో 24 గ్రామాల వేలాది భక్తుల మధ్య పోటీ కాస్త మృత్యు సమరం గా మారింది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘర్షణలో మరో వంద మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంప్రదాయం పేర జరిగే ఈ హింసాత్మక వేడుకలలో పోలీసులు కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావడం వల్ల ఈ ఘోరం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *