సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఫై కొందరు సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానెల్స్ లోను పనిగట్టుకొని ఎంత నెగిటివ్ టాక్ ప్రచారం చేసిన సరే.. ప్రపంచ వ్యాప్తంగా ‘సూపర్ డూపర్ హిట్’ సినిమాగా కలెక్షన్స్ లో ప్రభంజనం కొనసాగుతుంది. ఇక జూ. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ప్రూఫ్ చేసుకొన్నాడు. కొరటాల శివ డైరెక్టర్ గా తన దమ్ము చూపించాడు. ఉత్తరాదిన కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న కోట్లాది రూపాయలు కలెక్షన్స్ దేవర స్టామినా ను ప్రూఫ్ చేస్తున్నాయి. మొత్తంగా దేవర సినిమా గత మూడు రోజుల్లో ఏకంగా 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మొదటి రోజు 172 కోట్లు కలెక్ట్ చేసిన దేవర సినిమా రెండో రోజు 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నిన్న ఆదివారం మూడో రోజు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక భీమవరం పట్టణంలో ‘దేవర’ సినిమా కేవలం 3 రోజులకే 76 లక్షల రూపాయలు వసూళ్లు సాధించి కోటి రూపాయలు దిశగా అడుగులు వేస్తుంది. మొదటి రోజు 11 థియేటర్స్ లో విడుదలయి 60 షోస్ ప్రదర్శింపబడి ఒక్కరోజులో అర కోటి పైగా( 50 లక్షల 83వేల రూపాయలు) వసూళ్లు చెయ్యగా నిన్న ఆదివారం 6 థియేటర్స్ లో ప్రదర్శించారు. అంత భారీ హిట్ సాధించాడు దేవర..
