సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేవాదాయశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగిస్తున్న ఆరోపణపై నలుగురుపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఎస్సై నాళం శ్రీనివాసరావు చెప్పిన వివరాలు ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన దంపనబోయిన శ్రీనివాస్ విజయకృష్ణ, మరో ముగ్గురు కలిసి పాలకోడేరు శివారు గరువుకు చెందిన మల్లుల వెంకటపార్వతి, దుర్గా శ్రీనివాస్ దం పతులకు చిత్తూరు జిల్లా లో ప్రఖ్యాత దేవాలయం కాణిపాకం దేవస్థానం లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పి స్తామని మోసపు మాటలు చెప్పి దానికి కోసం రూ.11 లక్షలు ఖర్చవుతుందని చెప్పి నగదు తీసుకున్నాక తీవ్ర కాలయాపన చేయడంతో పాటు తీసుకున్న డబ్బుకు సమాధానం చెప్పకపోవడం తో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసులో వాస్తవాలు విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *