సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు శుభవార్త ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌కు వరి మద్దతు ధరను 69 రూపాయలకు పెంచింది. తాజా పెంపుతో ఆంధ్ర ప్రదేశ్ లో వరి రైతులకు క్వింటా వరి మద్దతు ధర 2,369 రూపాయలకు చేరింది. కేంద్రం MSP కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంకా రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్ల రూపాయలు కేటాయించింది. పెట్టుబడిపై రైతులకు 50 శాతం లాభం ఉండేలా నిర్ణయం తీసుకుంది. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాటి వివరాలు: పత్తి క్వింటాకు రూ.589 పెంపు, జొన్నలు క్వింటాకు రూ. 328 పెంపు, సజ్జలు క్వింటాకు రూ.150 పెంపు, రాగులు క్వింటాకు రూ.596 పెంపు, మొక్కజొన్న క్వింటాకు రూ.175 పెంపు, కందిపప్పు క్వింటాకు రూ.450 పెంపు,పెసర్లు క్వింటాకు రూ.86పెంపు, మినుములు క్వింటాకు రూ.400 పెంపు, వేరుశనగ క్వింటాకు రూ.480 పెంపు, పొద్దుతిరుగు క్వింటాకు రూ.441 పెంపు, సోయాబీన్ క్వింటాకు రూ.436 పెంపు, కుసుములు క్వింటాకు రూ.579 పెంపు,ఒలిసెలు క్వింటాకు రూ.820 చప్పున పెంచడం జరిగింది.
