సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విభిన్న సినిమాలతో ఓ మోస్తరు విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విశ్వక్ సేన్ ఇటీవల .. గోదావరి జిల్లాలోని మత్యకారుల జీవితాలలో సరదాలు సంఘర్షణలు ఫై సుదీర్ఘ కాలంగా షూటింగ్ చేసి పూర్తీ చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో గత శనివారం రాత్రి జరిగింది. టీజర్ అందరికి ఆసక్తి రేకేతించే సన్నివేశాలలతో ముచ్చటగా ఉంది. అయితే ఈవెంట్లో విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..” నా దృష్టిలో దేశంలోనే అందరికంటే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రభావం అంటే ఆయనంత గప్ప నటుడ్ని కావాలని ఉంటుంది. అందరూ ఆయన్ని స్టార్ అంటారు. కానీ నాకు తెలిసి ఇండియాలోనే అందరి కంటే గొప్ప నటుడు ఆయనే.దానికి నేను ఫ్యాన్. ఒక స్టార్ కంటే నాకు ఆయన గొప్ప నటుడు” అని అన్నాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్ సేన్ కి ఎలాంటి బాండింగ్ ఉందో తెలిసిందే. విశ్వక్ ఇప్పటికే ఎన్టీఆర్ ని పలుమార్లు కలిసాడు విశ్వక్ సేన్ కు అదే బాండింగ్ నందమూరి బాలకృష్ణ తో కూడా ఉంది.. దూరం దూరంగా ఉండే బాబాయ్- అబ్బాయిలతో చెట్టపట్టాలు విశ్వక్ సేన్ కు భలే కుదిరింది. మరి విశ్వక్ , జూ ఎన్టీఆర్ ఫై చెప్పిన అభిప్రాయానికి బాలయ్య ఏమనుకొంటారో ? కదా?
