సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే అతి ఎత్తయిన 206 అడుగుల డాక్టర్ అంబెడ్కర్ కాంస్య విగ్రహాన్ని నేడు, శుక్రవారం సీఎం జగన్ విజయవాడలో ప్రారంభించారు. ఈ విగ్రహంతో ఏపీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా చాటుతుందన్నారు. దేశంలోనే ప్రపధంగా 18 ఎకరాల్లోదాదాపు రూ.404.35 కోట్లతో ఈ విగ్రహాన్ని మరియు అందమైన గార్డెన్ను రూపొందించారు. ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్నే ఉపయోగించారు. అందమైన పార్కులో వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్న పిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. భవనం లోపల అంబెడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్వర్క్ ఏర్పాటుచేశారు. విగ్రహం బేస్ కింది భాగంలో.. 2ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియమ్స్ లు ఉంటాయి. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నా యి. ఇవన్నీ అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్ప కళతో రూపొందించారు ఈ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు.స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చి న 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో అంబెడ్కర్ కు ఘన నివాళి తో పాటు టూరిజం అభివృద్ధికి అదనపు ఆకర్షణగా కీలక అడుగు పడిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *