సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలోనే తొలిసారి తెలుగువారి .. ప్రైవేట్ సంస్థ తయారుచేసిన రాకెట్ విక్రమ్-ఎస్ ఆకాశం లోకి దూసుకెళ్లింది. నేడు, శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్ నగరానికి చెందిన స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రవేటు రాకెట్ ను తయారు చేసింది. నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ గమనాన్ని , కక్ష్య ను పరిశీలించిన శాస్త్రవేత్తలు తఙ్గాగా ‘మిషన్ ప్రారంభ్’ విజయవం తమైందని ప్రకటించారు దేశంలో తొలిసారి ప్రవేటు సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ రూ పొందిం చిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ‘మిషన్ ప్రారంభ్”విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.
