సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి మంగళవారం (నవం బరు 1) నుండి మన భారత దేశంలో కరెన్సీ వినియోగంలో పేపర్ నోటు లేకుండా విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడుతూ తొలిసారిగా అధీకృత ‘డిజిటల్ రూపాయి’ వినియోగంలోకి వస్తుంది. ముందుగా దీని పరిణామాలు గుర్తించడానికి ట్రయల్ వినియోగానికి ముంబయిలోని ఎస్బీఐ తో సహా దేశంలోని 9 బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇం డియా (ఎస్బీఐ), బ్యాం క్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాం క్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీం ద్రా బ్యాం క్, యెస్ బ్యాం క్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీలు ప్రభుత్వ సెక్యూ రిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్ రూపాయిని జారీ చేస్తాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ సెక్యూ రిటీల్లో సెకండరీ మార్కె ట్ లావాదేవీల సెటిల్మెంట్ లకు ఈ వర్చువల్ కరెన్సీని ఉపయోగిస్తారు. ఇం దువల్ల ఇం టర్-బ్యాం క్ మార్కె ట్ మరిం త సమర్థం గా మారి కేంద్ర బ్యాం కులో నగదు సెటిల్మెంట్లు తగ్గడం వల్ల, లావాదేవీ వ్యయాలు తగ్గుతాయి. భవిష్యత్తులో ఇతర టోకు లావాదేవీలకు, విదేశీ చెల్లింపులకు వినియోగించే ఆలోచనలో ఉన్నారు
