సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం మొత్తం ఆదీపురుష్ సినిమా మీద విమర్శలు, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ ప్రభంజనం తో అవన్నీ కొట్టుకుపోయాయి. మొదటి మూడు రోజులలోనే సుమారు 340 కోట్లు సాధించి, రిలీజ్ అయిన మొదటి వారం 430 కోట్లు రికార్డు వసూళ్లు సాధించిన’ ఆదిపురుష్’ కలెక్షన్ దెబ్బకు బాలీవుడ్ లో ఆయన హావ గిట్టని వారికీ మాట పడిపోయింది. భీమవరం లో 7 రోజులకు ఆదిపురుష్ 96 లక్షల రూపాయలు వసూలు చేసి నేడు, శుక్రవారం ‘కోటి’ దాటెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 7 రోజులలో 4 కోట్లు పైగా ‘షేర్’ సాధించి ‘సింహం’లా నిలబడ్డాడు ఆదిపురుష్.. ఎవరు ఏమనుకున్నా ఇటీవల.. దేశంలో సరైన సినిమా లేక థియేటర్స్ లో సీట్లకు పట్టిన దుమ్ము దులిపేసాడు ఆదిపురుష్ సినిమాతో.. దేశ చరిత్రలో వరుసగా చేసిన 5 సినిమాలలో 4 సినిమాలు 430 కోట్ల పైగా కలెక్షన్స్ వసూళ్లు చేసిన ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్ సాధ్యపడలేదు.మ్యూజికల్.. లవ్ స్టోరీ తో వచ్చిన ‘రాధే శ్యాం’ సినిమా కూడా 250 కోట్లు సాధించిందంటే అది ప్రభాస్ మ్యానియా సత్తా వల్లే.. ఫ్లాప్ అంటే..రాధేశ్యాం.. భీమవరం లోనే కోటి రూపాయలు వచ్చింది. త్వరలో సెప్టెంబర్ 28న వస్తున్నా ఫుల్ మాస్ అండ్ క్లాస్ బొనాంజా..సలార్ సినిమా తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో వస్తున్న తెలుగు తేజం ప్రభాస్ ను ఇంకెవరు ఆపలేరని బాలీవుడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *