సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అమెరికా మొదలుకొని యూరప్ దేశాలలో ప్రతి రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు మరల నమోదు అవుతున్నాయి. భారత్ లో దేశంలో కూడా శీతాకాలం, క్రిస్మస్, కొత్త ఏడాది , పండుగల నేపథ్యంలో విదేశాల నుండి ఎక్కువమంది భారత్ రావడం, ఉత్తరాన అసెంబ్లీ ఎన్నికల కోలాహలాలు తో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్‌ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నేడు,బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు.ఒక్క రోజులోనే 18వెలపైగా అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు కావడం, ఢిల్లీలో కూడా వేలాదిగా కేసులు పెరుగుతుండటం గమనార్హం.. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణాలో కూడా ఇటీవల కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏపీలో మాత్రం కేసులు వందల సంఖ్యలో పెరుగుతున్నాయి. పరిస్థితి అదుపులో ఉంది. ఓమిక్రాన్ కేసులు కూడా ఇప్పటికే కేవలం 24 మాత్రమే నమోదు అయ్యాయి. ఏపీలో సంక్రాంతి పండుగకు వచ్చే దూరప్రాంతాల వారితో అప్రమత్తంగా ఉండవల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ రోజువారి పాజిటివ్ రేటు 4.18 శాతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *