సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రపంచ దేశాలలో రోజు లక్షలలో నమోదు అవుతూ వణుకు పుట్టిస్తున్నఒమిక్రాన్ కేసులు లో మరణాలు సంఖ్యా గత కరోనా 2సీజన్లలతో పోలిస్తే చాల చాల తక్కువ.. వైరస్ వ్యాప్తి వేగం మాత్రం 3 రేట్లు ఎక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత్‌లో కూడా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. నేడు, శుక్రవారం దేశంలో 309 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1270కు చేరింది. 374మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర అత్యధికంగా 450కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీలో 320 పాజటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46,కర్ణాటకలో 34 మంది అత్యధిక ఒమక్రాన్ బాధితులు ఉన్నారు. తాజాగా ఒమిక్రాన్ కేసులు లో తోలి మరణం నమోదు అయ్యింది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తికి ఈ నెల 28న ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.అయితే అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.
