సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో భారత్‌లో థర్డ్ వేవ్ కరోనా వైరస్‌ ఉధృతి గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై నేడు, సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,06, 064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.2 శాతం తక్కువ నమోదయ్యాయి. గత ఆదివారం 439 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కేసులొచ్చాయి. ఆ తరువాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో కేసుల ఉదృతి తగ్గడం తో కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలు సడలించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటి 17.07 శాతం నుంచి 20.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22 లక్షల 49వేల 335 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.07గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *