సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్ భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) సీఎం చంద్రబాబు చేతులా మీదుగా ప్రారంభం అయ్యింది.. ఇది మొత్తం తిరుమల ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని ఆటోమేటిక్ గా ఆదేశాలిస్తుంది. అధునాతన AI-చాటెడ్ కమాండ్ సెంటర్‌. NRIల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ ప్రాజక్ట్ తో భక్తుల దర్శనాల అవకాశం మెరుగుపడుతుంది. ఈ సెంటర్‌లో 6,000కి పైగా AI-ఎనాబుల్డ్ కెమెరాలు ఉన్నాయి. ఇవి, ప్రతి నిమిషానికి 3,60,000 పేలోడ్‌లను ప్రాసెస్ చేస్తూ, ప్రతిరోజూ 51.8 మిలియన్ ఈవెంట్‌లను హ్యాండిల్ చేసి, 2.5 బిలియన్ ఇన్ఫరెన్స్‌లను రియల్-టైమ్‌లో జనరేట్ చేస్తుంది. అంతేకాదు, ఈ సాంకేతికత సహకారంతో భక్తుల కార్యకలాపాలను రియల్-టైమ్‌లో మానిటర్ చేసి, మొత్తం ఆలయ నిర్వహణను డిజిటల్‌ పద్దతిలో సమర్పిస్తుంది. ఈ AI అధునాతన ప్రాజెక్ట్,తిరుమల ఆధ్యాత్మిక వ్యవస్థలకు అండగా ఉంటుంది. శ్రీవారి అస్సిసులతో దేశానికీ ఆదర్శంగా నిలవబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *