సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ 2024 నుండి ఎన్నికలలో ఎన్నికల కమిషన్ తో కలసి 5 రకాలుగా దొంగ ఓట్ల తో మోసాలతో దేశంలోను , పలు రాష్ట్రాల లో గెలిచిందని తాను ఆధారాలతో నిరూపించానని , ఈసీ మాత్రం తన సవాల్ కు తన ఆధారాలు కు భయపడి ఏకంగా తాజగా ఎన్నికల వెబ్ సైట్ లో ఎన్నికల ఓటర్లు రిపోర్ట్ ను కనపడకుండా నిలిపివేసింది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేడు శుక్రవారం మరోసారి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన లక్ష మంది పాల్గొన్న బహిరంగ సభలో విమర్శించారు. దేశంలో పలు రాష్ట్రాలలో, ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన సంస్థ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లను దొంగిలించేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆయన విమర్శించారు. మహారాష్ట్రలో లోక్ సభ కు కేవలం 5 నెలలు విరామంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికీ 1 కోటి దొంగ ఓట్లు చేర్చారని, కర్ణాటకలో కూడా దారుణంగా ఓట్ల చోరీ జరిగిందని,దీనితో కాంగ్రెస్ ఇక్కడ ఇంకా గెలవవలసిన 7 లోక్ సభ సీట్లు కోల్పోయిందని ఇది దేశంలో పలు రాష్ట్రాలలో జరిగిందని బీజేపీ, ఎన్నికల సంఘం కలసి ఎన్నికలలో గెలవడానికి అడ్డు అదుపులేని మోసాలకు పాల్బడ్డారనిదేశంలోని ప్రజా స్వామ్యానికి పెను ముప్పు గా మారిందని ఎన్నో తీవ్ర ఆరోపణలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *