సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: యూరప్ దేశాల లో ముఖ్యంగా ఒక అమెరికాలో ఒక్క రోజులోనే మిలియన్ కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అక్కడి నుండి వచ్చే ప్రయాణికుల ద్వారా, ఇతరత్రా కూడా భారత్‌లో కరోనా మహమ్మారి అకస్మాత్తుగా విజృంభిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర తో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో సింహభాగం కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై నేడు, శుక్రవారం ఉదయం బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో80శాతం పైగా వ్యాక్సినేషన్ పూర్తీ కావడం పెద్ద భరోసా.. అయినా అందరు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి , జాగ్రత్తలు పాటించవలసిందే..
