సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో శుభకార్యాల వేళా బంగారం ధరలు వరుసగా 2వ రోజు దిగివస్తున్నాయి. నిన్న పెరిగిన వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు బుధవారం (మే 28న) ఉదయం తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.160 తగ్గిపోయి రూ.97,470కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.160 పడిపోయి రూ. 89,340కి చేరింది.ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో అయితే వెండి ధర చౌకగా ఉంది. కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గిపోయి రూ.99,900కు చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడలో కూడా కేజీ వెండి రేటు రూ.1,10,900కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *