సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది ఇండియాలో ఘనవిజయాలు సాధించిన టాప్ టెన్ మూవీస్‍లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానం లో నిలిచింది.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ఐ ఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసినజాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 10లో తెలుగు భాషకు చెందిన 4 పాన్ ఇండియా సినిమాలు ఉండటం విశేషం. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కు వ బడ్జెట్తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సా ఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 ఘనవిజయాలు సాధించిన భారతీయ సినిమాలు – 2022 గా 1. ఆర్ఆర్ఆర్ 2. ది కశ్మీ ర్ ఫైల్స్ 3,కేజీయఫ్-2, 4. విక్రమ్, 5 కాంతార, 6. రాకెట్రీ 6మేజర్, 7 సీతారామం 8. పొన్నియిన్ సెల్వన్ 9 కార్తికేయ 2, 10, చార్లీ 777 చిత్రాలు టాప్ 10లో స్థానం సంపాయించాయి. RRR జపాన్ లో కూడా 25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ కొల్లగొట్టి ముత్తు 24 కోట్ల రికార్డు ను దాటేసిన తోలి భారతీయ చిత్రంగా నిలబడింది.
