సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు భారీగా క్యూ లైన్ లో నిలబడి ఉన్నారని సమాచారం.నేడు, గురువారం ఉదయం 7.00 గంటలకు ఈ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబుర్, పంజాబ్‌లోని లూథియాన పశ్చిమ, గుజరాత్‌లోని కాడి, విశవదార్ అసెంబ్లీ స్థానాలకు ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23వ తేదీన వెలువడతాయి. మరోవైపు కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉప ఎన్నికల్లో ఓటర్లు తీర్పు కీలకమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *