సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మొత్తం 7విడతలుగా నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న లోక్ సభ ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ నేడు సోమవారం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే జరిగిన 4విడతలలో ఎన్డీయే కూటమితో ఇండియా కూటమి కూడా హోరాహోరీ తలపడిందని వార్తలు వస్తున్నాయి. గత 4 దశలలో పోలింగ్ ప్రమాణాలు బట్టి 400 కాదుకదా 240 నుండి 300 మధ్య ఎన్డీయే సాధించడమే కష్టం అంటూ బీజేపీ ఫై కాంగ్రెస్ తదితర పార్టీల అధినేతలు కౌంటర్లు వేస్తున్నారు.రైతుఋణమాఫీ బాగా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈసారి కేవలం 49 స్థానాలకే ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ప్రజలు వేసే ఓట్లు చాల కీలకం. ఆ స్థానాలు ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించడం, పలువురు హేమాహేమీలు బరిలో ఉండడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజధాని లఖ్‌నవూ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, శరణ్ (బిహార్)లో బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, హాజీపూర్‌లో రాంవిలాస్ పాసవాన్ కుమారుడు చిరాగ్ పాసవాన్ వంటివారు ఈ దశలో పోటీపడుతున్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు
