సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం అసెంబ్లీ సమావేశాలలో ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన కాల్వగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం లో భాగంగా సీఎం జగన్ ప్రతిపక్ష నేత అచ్చేమ్ నాయుడు ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టటం జరిగింది. అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రోద్బలం తో ఏపీలో ఒక వర్గం మీడియా కలుషితం అయిపోయిందని, దుర్బుద్ధితో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి మంచి పనిపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తోందని విమర్శించారు. నిజానికి గత చంద్రబాబులో పాలనలో కంటే.. వైసీపీ పాలనలో ఆర్థికవ్యవస్థ బాగుందని అంటూ ఆధారాలతో వివరించారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీది ప్రథమ స్థానంలో ఉందని ప్రకటించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 3 పారిశ్రామిక కారిడార్లు సాధించామని ఇంకా బల్క్ డ్రగ్ పార్కుతో 30 వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. 17 రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ సాధించామని అన్నారు. గత టీడీపీ హయాంలో పారిశ్రామికరంగాన్ని నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వం పారిశ్రామికంగా ఏపీలో 62,541 మందికి ఉపాధి కల్పించాం. మరో 40 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.కరోనా అడ్డుకొన్న సరే.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా11.43 శాతం పారిశ్రామికాభివృద్ధితో ఏపీ దూసుకెళ్తోంది. టీడీపీ హయాంలో సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులొచ్చాయి. రూ.91,121 కోట్ల విలువైన పది ప్రాజెక్ట్‌లపై చర్చలు జరిపాం. ఏపీకి రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. ఏపీలో. 3 ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతామంటే టీడీపీ వారు ఏడుస్తారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఏడవడం తప్ప ప్రతిపక్షం చేసిందేమీ లేదు అని జగన్ ఎద్దేవా చేసారు.
