సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు నేడు, మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీనితో భీమవరంలో పలు ప్రధాన బ్యాంకులు పని చెయ్యకపోవడంతో మొన్న ఆదివారం, నిన్న రేపుబ్లిక్ డే నేడు, బంద్ ..వరుసగా 3 రోజులు బ్యాంకులు తెరవక పోవడంతో ఖాతా దారులు ఇబ్బందులు పడ్డారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరుగుతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ ముఖ్యమైన డిమాండ్లు .. వారానికి ఐదు రోజుల పని దినాలు(ఇప్పటికే రెండు శనివారాలు సెలవులు ఉన్నాయి), వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం(Bipartite Settlement) పూర్తిగా అమలు చెయ్యాలని, పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *