సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి సినిమాల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యిన హనుమన్ సినిమా కలెక్షన్స్ సునామి రోజురోజుకి పెరిగిపోతుంది. మన భీమవరం కుర్రోడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా వార్తలో నిలిచాడు. హిందీ డబ్బింగ్ పుష్ప తో సమానంగా కలెక్షన్స్ సాధిస్తుంది. ‘2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ .. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బిం గ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.కేవలం హిందీ వర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వచ్చాయి.ఇప్ప టివరకు ఈ మూవీ కలెక్షన్స్ తెలుగుతో కలిపి 40 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. ఇక భీమవరం చూసుకుంటే.. మొదటి రోజు పట్నం మొత్తం మీద 16 ఆటలు ప్రదర్శిస్తే రెండోరోజుకి 20 ఆటలు మూడోరోజుకి 22 ఆటలు చోపున్న ప్రదర్శనలు పెరుగుతూ అల్ షోస్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. భీమవరంలో కోటి రూపాయల గ్రాస్ సాధించే అవకాశం హనుమాన్ కు ఉంది.భీమవరం బ్రాండ్ ప్రభాస్ నటించిన సాలార్ ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లు సాధిస్తే భీమవరంలో కోటి యాభై లక్షల గ్రాస్ దిశగా సమీపిస్తోంది. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యిన నాలుగు సినిమాల్లో హనుమాన్ విజేతగా నిలిచాడు.
