సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికం దిగ్గజం జియో నెట్ వర్క్ సేవల్లో నేడు, మంగళవారం పలు ప్రాంతాలలో అంతరాయం ఏర్పడింది అని తాజా వార్త కధనాలు సమాచారం. ఇన్ కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదని వినియోగదారులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జియోను కోరుతూ ట్వీట్లు పెడుతున్నా రు. ఈ తరుణం లో ఆన్లైన్ సర్వీసుల్లోని లోపాల్ని గుర్తించే డౌన్ డిటెక్టర్ సంస్థ,ఇప్పటి వరకు, 600కు పైగా ఫిర్యాదుల్ని గుర్తించినట్లు ప్రకటించింది. అయితే, నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొంటున్న వినియోగదారులు తక్కు వ మంది ఉం టారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, నాగ్ పూర్, కలకత్తా , ముంబై, బెంగళూరు, చెన్నై , హైదరాబాద్, అహ్మదాబాద్, ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం .కాగా, అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునే సదుపాయం లేని ఈ సమయం లో.. సాధారణ రోజుల్లోకం టే ఇప్పుడు ఇంటర్నెట్ బాగా వేగంగా పనిచేస్తోందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తలెత్తిన ఈ లోపాన్ని సరి చేసేందుకు జియో ప్రతినిధులు తాజగా కృషి చేస్తున్నారు.
