సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో దేశి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల నుంచి కోలుకుని గత మంగళవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం రోజంతా లాభనష్టాలతో దోబూచులాడి చివరకు స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. పలు సంస్థలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత మంగళవారం ముగింపు (81, 337)తో పోల్చుకుంటే నేటి బుధవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి ప్రవేశించింది. బుధవారం సెన్సెక్స్ 81,187-81,618 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 81, 481 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 33 పాయింట్ల లాభంతో 24, 855 వద్ద రోజును ముగించింది.సెన్సెక్స్‌లో అవెన్యూ సూపర్ మార్కెట్, కేపీఐటీ టెక్నాలజీస్, ఏపీఎల్ అపోలో, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్లు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 42 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో చుస్తే రూపాయి మారకం విలువ 87.42గా వద్ద ఉంది.
