సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ సానుకూల ప్రభావంతో భారత్ లో దేశీయమార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం లభాల్లో కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాలను కొనసాగిస్తోంది. (Indian stock)గత సెషన్ లాభాల ముగింపు (85, 186)తో పోల్చుకుంటే నేడు, గురువారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ లాభాల జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 85, 399 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 66 పాయింట్ల లాభంతో 26, 119 వద్ద కొనసాగుతోంది (stock market ) నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 230 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో ఉంది. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.73గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *