సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులుగా కాస్త అటుఇటుగా సబ్డుగా ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లునేడు, శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత క్రమంగా సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 11.15 గంటల నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.24 శాతం జంప్ చేసి 80,893.51 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ 50 కూడా 1.13 శాతం పెరిగి 24,592.20 వద్ద కొత్త గరిష్టాన్ని చేరింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 368 పాయింట్లు పెరిగి 52,369 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 కూడా 189 పాయింట్లు లాభపడి 57,337 పరిధిలోకి చేరుకుంది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న అనుకూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నేడు శుక్రవారం వారాంతం లో మంచి లాభాలను ఆర్జించే అవకాశం కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *