సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈవారం ఉత్సహంగా ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు శుక్రవారం వారాంతం రోజు మాత్రం భారీగా పతనమైంది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల నాటికి సెన్సెక్స్ 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది. కొన్ని గంటల్లోనే భారీ స్థాయిలో 4 లక్షల కోట్లు నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 502 పాయింట్లు దిగజారింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఆసియా మార్కెట్ల క్షీణత కారణంగా భారత స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాలు జరిగాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఇంధన రంగ షేర్లు అత్యధికంగా పడిపోయాయి.
