సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో నేడు, సోమవారం ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మొదట్లో స్వల్పనష్టాలు వచ్చిన మొత్తం మీద చివరకు పెద్దగా లాభనష్టాల ప్రమేయం లేకుండా సమాంతరంగా ముగిశాయి. అయితే రిలయన్స్, ఎఫ్ఎం సీజీ షేర్లు బాగారాణించాయి. బీఈఎల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 83,398.08 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,432.89) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. చివరికి 9పాయింట్ల లాభంతో 83,442.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,461 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.88గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *