సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం ఉదయం నుండి దేశీయ స్టాక్ మార్కె ట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభిం చాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 60,995 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18,130 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.98 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్ , ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ , మారుతీ, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
