సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధి కారులను రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా జనసేనతో పాటు మరో ఐదు అంశాలపై వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా, ఈసి నిబంధనల ప్రకారం గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొ ద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. టీడీపీ జనసేన లు రాష్ట్రంలో దొంగ ఓట్ల ఫై గగ్గోలు పెడుతున్నాయని, నిజానికి ఎప్పడు ఓటమి భయంతో ఉండే చంద్రబాబు కు ఈ దొంగఓట్ల గురించి తెలిసినంత .. ఆ స్టాటజీ గురించి ఎవరికీ తెలియదని .. అటు తెలంగాణలోనూ ఇక్కడ ఏపీలో కూడా ఒకే ఓటర్లు తో వారే ఓట్లు వెయ్యిస్తారని, అందుకే లోక్సభ కు అసెంబ్లీ కి ఒకే రోజు ఒకేసారి ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని ఈసి ని కోరామని, ఎన్నికలకు ముందు ఈసీ ఎక్కడైనా దొంగఓట్లు గుర్తించి వాటిని తొలగించితే పక్రియ చేస్తుందని కానీ దొరికిన ప్రతి దొంగఓటు పాపం వైసిపి కి అంటగట్టే పనిలో చంద్రబాబు పవన్ ఉన్నారని విమర్శించారు. అది ఎన్నికలకు ముందు సహజంగా జరిగే పక్రియ అని అన్నారు. జనసేన పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ .. గాజు గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని వైసీపీ ఫిర్యాదు చేసినట్టు, అలాగే అటు బీజేపీ తో అలయన్స్ ఇటు టీడీపీ తో అలయన్స్ తో కొద్దీ సీట్లు పోటీ చేస్తున్న జనసేన కు రాష్ట్రము అంతటా ఒకే గుర్తు కేటాయింపు ఎలా? కుదురుతుందని ఈసీ ని ప్రశ్నించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *