సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని కోలనపల్లి గ్రామంలో ( కాళ్ళ దగ్గర) గత బుధవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించిన యువకులను స్థ్ధానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన సంఘటన నేడు, గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.. కాళ్ళకు చెందిన తోట సత్యనారాయణ కుటుంబంతో కోలనపల్లి లో అద్దే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆయన గత బుధవారం రాత్రి ఆయన ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఐదుగురు యువకులు కారులో వచ్చి సత్యనారాయణ ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. ఇది గమనించిన సత్యనారాయణ అరవడంతో స్ధానికులు రావడంతో ముగ్గురు యువకులు పరారయ్యారు. అయితే మరో ఇద్దరిని మాత్రం గ్రామస్థులు బంధించి చెట్టుకు కట్టేసి కాస్త దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులను చుస్తే చదువుకున్నవారిలా పెద్దింటి కుటుంబాలకు చెందిన వారు గా కనపడుతున్నారని , వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు దిగి ఉంటారని,పెద్దగా అనుభవం లేక దొరికిపోయారని భావిస్తున్నారు. కాళ్ళ పోలీసులు చెట్టుకు కట్టేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
