సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ, రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌కి లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు కాపాడుకోవాలని, తమ ఓట్లు ను ఒకమారు పరిశీలించుకోవాలని , ఏపీ ప్రజలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. రాష్టంలోనూ,..తన పార్లమెంట్ పరిధిలో పలు చోట్ల ఒకే ఇంటిపై అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. దొంగ ఓట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరకు పని చేస్తున్న వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారని ఆరోపిస్తూ,అధికారుల సహకారంతో దొంగ ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం ద్వారా వాలంటీర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను పూర్తీ దూరంగా పెట్టేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *