సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : 2రోజులు వేచి ఉన్నపటికీ కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవడంతో గత రాత్రి తో పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకొన్నారు.అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ టూర్‌పైనే చర్చ నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని కూడా భావించారు, అయితే గత రాత్రి మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సహజ ధోరణిలో.. బీజేపీ జనసేన పార్టీలు ఏపీలో జగన్ పాలన కు ముగింపు పలుకే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయని, జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చనీయనని పొడి పొడిగా మాట్లాడారు, ఆయన ముఖంలో చర్చలు విఫలం అయ్యిన తీరులో అసహనం స్వష్టంగా కనపడింది. అయితే ముందుగా అనుకున్నట్లుగా పవన్ పర్యటన హస్తినలో సాగలేదట. అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన బిజిబిజీ షెడ్యూల్‌తో కలవడానికి కుదరలేదట. దీంతో మూడ్రోజులు అనుకున్న పవన్ పర్యటన రెండ్రోజులకే ముగించుకొన్నారు. జేపీ నడ్డాతో భేటీతో అయినా పొత్తులపై క్లారిటీ వస్తుందనుకుంటే.. లెక్కలు ఎటూ తేలలేదు. మరి టీడీపీ తో పొత్తు కు బీజేపీ పెద్దలు మరో సారి విముఖత చూపారని అందుకే పవన్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి,
