సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగునాట శ్రీవారి భక్తులకు చిన్నతిరుమల గా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ‘ద్వారకా తిరుమల శ్రీచిన్నవెంకన్న ఆలయ ( Chinna Venkanna ) ధర్మ కర్తల మండలి, ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా దేవాలయంలో ఉదయం పూత సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్థానంలో తిరుప్పావై సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 29వ తేదీన స్వామివారి పాదుకా మండపం నుంచి శేషాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షణ మరియు ఈనెల 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ప్రకటించారు. ఈనెల 30వ తేదీన నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈనేపథ్యంలో స్వామి వారికి సాయంకాలం రోజు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *