సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ మంగళవారం తెలుగు దేశం పార్టీ నిరసన ఉద్యమం చేపట్టింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు నిరసనగా భీమవరం మండలం తహశీల్దార్ కి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు,మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధసారధి, వేండ్ర శ్రీనివాస్ తదితరులు వినతి పత్రం అందజేశారు. పాలకొల్లు, ఉండి, ఏలూరు, భీమవరం, తణుకు, కొవ్వూరు, నర్సాపురం, దెందులూరు, పెదపాడు, పెదవేగి, టీ.నర్సాపురం, దేవరపల్లిలలో పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు పాల్గొ న్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ధరలు పెరిగాయని ఆరోపించారు. ఉంగుటూరులో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు, పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర, ఉండిలో ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్‌, వలవల బాబ్జీ, ముప్పిడి వెంకటేశ్వరరావు, బడేటి చంటి తదితరులు నిరసనలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *