సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘ధురంధర్ 2’ (Dhurandhar The Revenge) తెలుగు వెర్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయం .. రేపు, మార్చి 19న సినిమా విడుదల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే.. అంటే నేటి బుధవారం సాయంత్రం నుండి ప్రీమియర్స్ సాధారణ టికెట్స్ ధరలకే ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే తెలుగులో సినిమా చూడాలని టికెట్ బుక్ చేసుకున్న అభిమానులకు తెలుగు రాష్ట్రాలలోని పలు మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి అమౌంట్ రిఫండ్ కూ డా చేస్తున్నాయి. కారణాలు తెలియరాలేదు. సాంకేతిక సమస్యలతో తెలుగు వెర్షన్ ప్రీమియర్ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. రేపు గురువారం యథాతధంగా హిందీతో పాటు, తెలుగులోనూ ప్రదర్శించనున్నట్లు సమాచారం . మరోవైపు దర్శకుడు ఆదిత్యధర్ అభిమానులతో తాజా పోస్ట్ లో ఆసక్తికర విషయం తెలిపారు. .సినిమా చివరి వరకూ చూడమని ఎం డ్ క్రెడిట్స్ పడేవరకూ థియేటర్లోనే ఉండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *