సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమా సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. అయితే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాతలు ప్రేక్షకులలో ఉన్న ఆసక్తిని మరింత కోట్ల సొమ్ము చేసుకోవడానికి ధురంధర్ ది రివెంజ్ విడుదలకు ముందు, జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 స్క్రీన్‌లలో మరోసారి దురంధర్ మొదటి సినిమానే అరుదైన థియేట్రికల్ రీ-రిలీజ్‌లో ప్రపంచవ్యాప్తంగాతిరిగి స్క్రీన్ పైకి తీసుకువస్తున్నాయి. వీటిలో మార్చి 12 నుంచి ఇండియాలో 250 స్క్రీన్‌లు.. విదేశాలలో 250 స్క్రీన్‌లు మార్చి 13 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి. ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం దాదాపు 185 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. ఇక 4 గంటల ప్రదర్శన నిడివి ఉన్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ఒక రోజు ముందుగా మార్చి 18న అమెరికా, కెనడా అంతటా ప్రత్యేక ప్రీమియర్ షోలు వేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *